close
Choose your channels

ఎన్టీఆర్ తో రాశిఖన్నా.....

Friday, January 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శక‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు జై ల‌వ‌కుశ అనే టైటిల్‌ను ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్ర‌లు చేస్తాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

జ‌న‌తాగ్యారేజ్ స‌క్సెస్ త‌ర్వాత ఎన్టీఆర్ వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌కుండా చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 11న సినిమా లాంచ‌నంగా ప్రారంభం అవుతుందంటున్నారు. ఆగ‌స్టులో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న బబ్లీ బ్యూటీ రాశిఖన్నా వ‌న్ ఆఫ్ ది హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్తారు, యంగ్ హీరోల ప‌క్క‌నే న‌టించిన రాశిఖ‌న్నాకు ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టించే అవ‌కాశం రావ‌డం గొప్ప ట‌ర్నింగ్ పాయింటేన‌ని చెప్పుకోవ‌చ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.