close
Choose your channels

రకుల్.. రెండు మల్టీస్టారర్ మూవీస్

Saturday, January 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ త‌రం క‌థానాయిక‌ల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్రాల‌తో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. స్పైడ‌ర్ త‌రువాత మ‌రో తెలుగు చిత్రానికి సంత‌కం చేయ‌ని ఈ ముద్దుగుమ్మ తాజాగా రెండు తెలుగు సినిమాల‌కు సంతకం చేసింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. విశేష‌మేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ కావ‌డం.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. నితిన్‌, శ‌ర్వానంద్ క‌థానాయ‌కులుగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ క‌థానాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌నుంద‌ని స‌మాచార‌మ్‌. అంతేకాకుండా.. కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కులుగా శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీ ద‌త్ నిర్మించ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీలోనూ ర‌కుల్ ఓ క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని స‌మాచార‌మ్‌. మొత్తానికి రెండు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌తో ర‌కుల్ వార్త‌ల్లోకెక్కుతోంద‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.