close
Choose your channels

రామ్ చరణ్, బోయపాటి సినిమాకి మ‌రో టైటిల్‌?

Saturday, June 2, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ చరణ్, బోయపాటి సినిమాకి మ‌రో టైటిల్‌?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉత్త‌రాది భామ కియారా అద్వాని జంటగా యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవ‌ల‌.. బ్యాంకాక్‌లో 15 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది చిత్ర యూనిట్.

తాజా సమాచారం ప్రకారం.. తదుపరి షెడ్యూల్ జూన్ 12 నుంచి హైదరాబాద్‌లో జరగనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికొస్తే ఇప్పటికే పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘రాజమార్తాండ’ పేరుతో పాటు.. 'రాజవంశస్థుడు' పేరును కూడా పరిశీలించారు.

అయితే ఈ టైటిల్స్ పై మెగా అభిమానులు అంతగా ఆసక్తి చూపించకపోవడంతో మళ్ళీ టైటిల్ వేటలో పడ్డారు బోయపాటి. ఈ నేపథ్యంలో ఈ కథకు 'జగదేకవీరుడు' టైటిల్ అయితే యాప్ట్‌ అవుతుందని దర్శకుడు భావించారట.

ఈ విషయమై ఇటు చిరు తోనూ, అటు చరణ్ తోనూ ప్రస్తావించారట. ఈ టైటిల్ అయితే ఈ సినిమా బజ్ మరింత పెరిగే అవకాశం ఉందని దర్శకనిర్మాతలు కూడా భావిస్తున్నారట. మ‌రి మెగా ఫ్యామిలీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా 2019 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంద‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.