close
Choose your channels

ర‌వితేజ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతున్న రామ్‌

Sunday, April 29, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌వితేజ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతున్న రామ్‌

ఎన‌ర్జిటిక్‌ స్టార్ రామ్ హీరోగా పి.ఎస్‌.వి. గ‌రుడ‌వేగ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ నిర్మించనున్నారు. ఇటీవ‌లే లాంచ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా.. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోనుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని క‌థానాయిక పాత్ర‌ కోసం ర‌క‌ర‌కాల పేర్లు వినిపించినా.. తాజాగా మాళవికా శర్మను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అధిక భాగం ఫారిన్‌లో షూటింగ్ జరుపుకోబోయే ఈ చిత్రానికి ఎక్కువ కాల్ షీట్స్ అవసరం పడతాయి కాబ‌ట్టి స్టార్ హీరోయిన్‌లతో ఈ కాల్ షీట్స్ సర్దుబాటు విషయంలో సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో.. చిత్ర బృందం మాళవికపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

అయితే.. మరి కొద్ది రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం మాళవిక ‘నేల టిక్కెట్టు’ సినిమాలో రవితేజ సరసన ఆడి పాడనున్న విషయం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.