close
Choose your channels

Ramoji Rao:విషప్రచారం చేయడంలో రామోజీరావు దిట్ట.. సరిలేరు ఆయనకెవ్వరు..

Monday, May 6, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబు బ్యాచ్ చేస్తున్న దుష్ప్రచారం తిరిగి ఆ పార్టీ మెడకే చుట్టుకుంది. ఈ ఫేక్ ప్రచారంపై ఏపీ సీఐడీ ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చట్టంను పొగుడుతూ రామోజీరావు నేతృత్వంలోని ఈటీవీ ప్రసారం చేసిన ఓ కథనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది అమలు అయితే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ కథనం సారాశం.

కానీ ఇప్పుడు ఎన్నికల వేళ తన ఆప్తమిత్రుడు చంద్రబాబుకు లబ్ధిచేకూర్చేందుకు ఒక్కసారిగా రామోజీరావు యూటర్న్ తీసుకున్నారు. తన ఈనాడు పత్రికలో పేజీలు పేజీలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. అలాగే ఈటీవీ ఛానల్స్ ద్వారా ప్రజలను భయపెట్టే ప్రోగ్రాంలు ప్రసారం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ చట్టాన్ని పచ్చ మీడియా అస్త్రంగా వాడుతున్నారని ఇక్కడే అర్థమవుతుంది. చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన ప్రజలను తప్పుదోవ పట్టించడం చాలా బాధాకరం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో ఈ చట్టం చాలా ఉపయోగకరం అంటూ అప్పుడు చెప్పిన వారే.. ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం వామ్మో ఈ చట్టంతో మీ భూములను లాక్కొంటారని ప్రజలను భయపెడుతున్నారు. ఎంతలా దిగజారిపోయారు అంటే చంద్రబాబుకు పనికొస్తుంది ఆంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి వెళ్లిపోయారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం మంచిది అంటూ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడేమో ఎన్నికల వేళ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని డ్రామాలు ఆడుతున్నారు. కేవలం చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారికి వారం రోజుల్లో జరిగే పోలింగ్‌లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోవడం ఖాయమంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.