close
Choose your channels

విజయ్ దేవరకొండని ఎప్పుడో.. లేటెస్ట్ గా సమంత, కాజల్ కు రష్మిక షాక్!

Wednesday, July 21, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన కన్నడ బ్యూటీ రష్మిక మందన జోరు ప్రస్తుతం మాములుగా లేదు. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక యువతని బాగా ఆకర్షించింది. వరుస విజయాలు కూడా దక్కాయి. ఫలితంగా సౌత్ లో రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

స్టార్ హీరోల సరసన ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎలాంటి సర్వే నిర్వహించినా రష్మిక టాప్ లో దూసుకుపోతోంది. తాజాగా రష్మిక మరో ఘనత సాధించింది. హీరోయిన్ల క్రేజ్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య నిదర్శనం. ఫాలోవర్స్ సంఖ్యని బట్టి సెలెబ్రిటీల క్రేజ్ ని నిర్ణయించవచ్చు.

హీరోయిన్లు తమ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటారు. రష్మిక తన ఫోటో షూట్స్, గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్ ని ఇన్స్టాగ్రామ్ లో బీట్ చేసింది.

ప్రస్తుతం రష్మిక ఇన్స్టాగ్రామ్ లో 19.5 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది. కాజల్ అగర్వాల్ ఫాలోవర్స్ సంఖ్య 19.1మిలియన్. సమంత 17.6 మిలియన్ ఫాలోవర్స్ తో కొనసాగుతోంది. వీరిద్దరిని రష్మిక అధికమించింది. రష్మిక కంటే పూజా హెగ్డే 14 మిలియన్స్ తో చాలా వెనుకబడి ఉంది.

ఇక రష్మిక కోస్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినప్పటికీ విజయ్ దేవరకొండకు అందనంత దూరంలో రష్మిక ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 12.5 మిలియన్ ఫాలోవర్స్ తో ఇన్స్టాగ్రామ్ లో కొనసాగుతున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.