close
Choose your channels

రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సెస్.. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు..

Saturday, January 20, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సెస్.. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు..

పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన సూపర్ సక్సెస్ అయింది. రేవంత్ అండ్ టీం పర్యటనతో గతేడాది కంటే రెండింతలు ఎక్కువగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. ఈ పర్యటన వల్ల రూ.40,232కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈనెల 14న దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలి రోజు నుంచే పెట్టుబడులు రాబట్టేలా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న మార్గాలను వారికి వివరించారు.

అలాగే ఈ సదస్సులో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికారు. రేవంత్ వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు ఉన్నారు. దీంతో రేవంత్ టీం జరిపిన చర్చలు ఫలించాయి. ఆయా కంపెనీలు రాష్ట్రంలో పెద్ద ఎత్తును పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సూపర్ సక్సెస్.. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు..

తెలంగాణ ప్రభుత్వంతో అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్‌ తదితర కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నామని వెల్లడించాయి. ఇందులో ఆదానీ గ్రూప్‌ రూ.12,400 కోట్లు, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ రూ.9వేల కోట్లు, గోడి ఇండియా ఎనర్జీ రూ.8వేల కోట్లు, టాటా టెక్నాలజీస్‌ రూ.1500కోట్లు, గోద్రేజ్‌ ఇండియా రూ.1270 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించాయి.

కాగా దావోస్ పర్యటన విజయవంతం కావడంతో రేవంత్ రెడ్డి టీం ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తోంది. నైట్‌ థేమ్స్‌ రివర్‌ ప్రాంతంలో రేవంత్ పర్యటించారు. అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లోని మూసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు లండన్‌ పర్యటనను వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూసీ నదిని థేమ్స్‌ నదిలా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో థేమ్స్ రివర్ పొడవునా అభివృద్ధి ఎలా జరిగిందన్న అంశంపై రేవంత్ స్వయంగా పర్యటించి అధ్యయనం చేశారు. థేమ్స్ నది విశిష్టత ఏంటి అంటే లండన్‌ ఉత్తరం వైపు ఓల్డ్ సిటీని, పశ్చిమ భాగాన ఉన్న మోడ్రన్ సీటీని కలుపుతుంది. దీంతో ఈ నదిని ఎలాగైతే అభివృద్ధి చేశారో మూసీని కూడా అలాగే అభివృద్ధి చేయాలని ప్రణాళికలు ర ఊపొందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.