close
Choose your channels

విజయ్‌ దేవరకొండపై దుష్ప్రచారం.. ఎదుగుతున్న హీరోని తొక్కాలనుకోవడం సహజమే : ఆర్జీవీ సంచలనం

Tuesday, September 13, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్ దేవరకొండ... స్వయంకృషితో, తనదైన నటనతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ ఎదిగిన హీరో . ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన లైగర్‌తో విజయ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ సినిమా హిట్ అయ్యుంటే విజయ్‌కి దరిదాపుల్లోకి కూడా ఎవరూ వచ్చేవారు కాదన్నది వాస్తవం. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టేసింది. అయితే విజయ్‌ని తొక్కేయడానికి కొందరు టాలీవుడ్ స్టార్స్ ప్రయత్నించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. లైగర్‌ రిలీజ్‌కు ముందే సినిమా ఫ్లాప్ అని, పూరీ, ఛార్మీలకు వ్యతిరేకంగా దాదాపు 2 వేలకు పైగా వీడియో రివ్యూలు రావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

విజయ్ యాటిట్యూడే వారికి అస్త్రం:

ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌తో జరిగిన డిబేట్‌లో పాల్గొన్న ఆర్జీవీ.. విజయ్ ఎదుగుదలను పకడ్బందీగా తొక్కేసేందుకు కొందరు ప్లాన్ చేశారనే ప్రశ్నకు వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఒక హీరో ఎదుగుతున్నాడంటే, తోటి స్టార్స్‌కి అసూయగానే వుంటుందన్నారు. ఇది ఇప్పటి నుంచే వస్తున్నది కాదని, అది ఏనాటి నుంచో జరుగున్నదేనని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ఒక హీరో ఫ్యాన్స్..మరో హీరోపై వీడియోలు చేసి టార్గెట్ చేయడమన్నది విజయ్ విషయంలో జరిగిందని ఆర్జీవీ చెప్పారు. వాళ్లకు అవకాశం విజయ్ దేవరకొండే ఇచ్చాడని.. ఆయన యాటిడ్యూడే ఇందుకు కారణమని వర్మ అభిప్రాయపడ్డారు.

విజయ్ తొలి నుంచి అంతే:

అయితే విజయ్ దేవరకొండ తొలి నుంచి యాటిడ్యూట్ చూపించేవాడని, కొత్తగా వచ్చిందేమి కాదని ఆర్జీవీ అన్నారు. లైగర్‌లో సత్తా లేకపోవడం వల్లే ట్రోలింగ్, నెగిటివ్ రివ్యూలు బాగా జరిగాయని ఆయన తెలిపారు. ఇదే సమయంలో విజయ్‌పై ప్రశంసలు కురిపించారు వర్మ. ఆ కుర్రాడి యాటిట్యూడ్ ఎవరికీ నష్టం చేయలేదని, ఎందరికో సేవలు చేస్తున్నాడని చెప్పారు. కానీ లైగర్ విషయంలో ఈ స్థాయి ట్రోలింగ్‌కు ఎన్నో కారణాలున్నాయని రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

కృష్ణంరాజుకు ఇదేనా మీరిచ్చే నివాళి :

మరోవైపు కృష్ణంరాజుకు టాలీవుడ్ సరిగా నివాళులర్పించలేదంటూ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వరుస ట్వీట్లు చేస్తూ అందరికీ ఇచ్చిపడేశారు. భక్తకన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న , తాండ్ర పాపారాయుడు లాంటి గొప్ప చిత్రాలు అందించిన మహానటుడు, గొప్ప నిర్మాతకు టాలీవుడ్ పెద్దలు ఘనంగా వీడ్కోలు పలకలేదంటూ వర్మ ఫైరయ్యారు. రెబల్‌స్టార్‌కు నివాళిగా ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపుకోలేని స్వార్ధపూరిత తెలుగు సినీ పరిశ్రమకు నా జోహార్లు, సిగ్గు సిగ్గు అంటూ ఆర్జీవీ కామెంట్ చేశారు. అంతేకాదు. కృష్ణ, మురళీ మోహన్, చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య, ప్రభాస్, మహేశ్, పవన్ కల్యాణ్‌లకు కూడా ఇదే దుస్థితి తప్పదని.. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వర్మ ఫైరయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.