close
Choose your channels

అను ఇమ్మాన్యుయల్ స్థానంలో రీతూవర్మ...

Wednesday, February 8, 2017 • తెలుగు Comments

మ‌జ్ను, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌, ఆక్సిజ‌న్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న హీరోయిన్ అను ఇమ్మాన్యుయ‌ల్ విక్ర‌మ్ హీరోగా, గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ధృవ న‌క్ష‌త్రం సినిమాలో క‌థానాయిక‌గా ఎన్నికైంది. కానీ డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డంలో అను ఇమ్మాన్యుయ‌ల్‌కు ఇబ్బంద‌లు త‌లెత్త‌డంతో అను ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని స‌మాచారం.

దాంతో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ తను ప్రొడ్యూస్ చేస్తున్న పెళ్ళిచూపులు త‌మిళ రీమేక్‌లో న‌టిస్తున్న రీతూవ‌ర్మ‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడ‌ట‌. విక్ర‌మ్ ప‌క్క‌న నటించే అవ‌కాశం రావ‌డంతో వెంట‌నే ఒప్పేసుకుంద‌ట‌. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz