close
Choose your channels

'ఆర్ ఆర్ ఆర్‌'... ఫ‌స్ట్ కాంబినేష‌న్ సీన్ అప్‌డేట్‌

Monday, October 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్ ఆర్ ఆర్‌... ఫ‌స్ట్ కాంబినేష‌న్ సీన్ అప్‌డేట్‌

ఒకే త‌రానికి చెందిన ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు క‌ల‌సి న‌టిస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది క‌దూ! ద‌శాబ్దాల త‌రువాత ఇలాంటి ఎక్స్‌పీరియ‌న్స్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నారు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి. అలా... ఆయన చేస్తున్న ఆ ప్ర‌య‌త్నం పేరే... `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ జ‌న‌రేష‌న్ స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క్రేజీ కాంబినేష‌న్‌లో.. `బాహుబ‌లి` సిరీస్ వంటి ఆల్ టైమ్ సెన్సేష‌న్స్ త‌రువాత జ‌క్క‌న్న రూపొందిస్తున్న చిత్ర‌మిది. అంతేకాదు.. హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని తెర‌కెక్కిస్తున్నాడు రాజ‌మౌళి.

పోరాట యోధులైన అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ క‌లిస్తే ఎలా ఉంటుంది? ఈ నేప‌థ్యంలో.. ఒక‌రి జీవితంపై మ‌రొక‌రి ప్ర‌భావం ఎలా ఉంటుంది? అనే క‌ల్పిత ఘ‌ట‌న‌ల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు రాజ‌మౌళి. అల్లూరి, కొమ‌రం క‌ల‌వ‌డ‌మే `ఆర్ ఆర్ ఆర్‌`లో ఇంట్రెస్టింగ్ పాయింట్ కావ‌డంతో... రాజ‌మౌళి ఆ దృశ్యాన్ని ఎలా డిజైన్ చేశాడు? అన్న‌దే అమితాస‌క్తిని క‌లిగించే విష‌యం. ఈ నేప‌థ్యంలో... తాజాగా అల్లూరి, కొమ‌రం ఫ‌స్ట్ కాంబినేష‌న్ సీన్‌పై ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే... ప్ర‌మాదంలో ఉన్న ఓ చిన్న పాప‌ని కొమ‌రం(తార‌క్‌) కాపాడ‌డం.. అది చూసి ఇంప్రెస్ అయిన అల్లూరి (చ‌ర‌ణ్‌) అత‌నితో చేతులు క‌ల‌ప‌డం... అనేది సినిమాలో ఫ‌స్ట్ కాంబినేష‌న్ సీన్‌గా ఉంటుంద‌ని టాక్‌. ఆ త‌రువాత వీరిద్ద‌రి పోరు బాట నేప‌థ్యంలో చిత్రం సాగుతుంద‌ని అంటున్నారు. మ‌రి... ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాలంటే వ‌చ్చే ఏడాది జూలై 30 వ‌ర‌కు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.