close
Choose your channels

అలియా భట్‌కు ‘RRR’ యూనిట్ స్పెషల్ బర్త్‌డే విషెస్

Sunday, March 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అలియా భట్‌కు ‘RRR’ యూనిట్ స్పెషల్ బర్త్‌డే విషెస్

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా ‘RRR’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్‌కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ జోడీగా హాలీవుడ్ బ్యూటీని తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా.. అలియా భట్ పుట్టిన రోజు నేడు. నేటితో ఆమె 27వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా.. అలియాకు ‘RRR’ చిత్రబృందం ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘మీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి వేచి చూస్తున్నాము’ అని సినిమా యూనిట్ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఓ షెడ్యూల్‌లో పాల్గొన్న అలియా.. త్వరలో మరికొన్ని సన్నివేశాల కోసం హైద‌రాబాద్‌కి రానుందని సమాచారం. జక్కన్న సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఆలియా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌ం అవుతోంది. ఆర్ఆర్ఆర్‌లో బాలీవుడ్ బ్యూటీ సీత పాత్రలో క‌నిపించ‌నుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి మెప్పించి మంచి విజ‌యాలు అందుకున్న ఈ భామకు టాలీవుడ్ ఏ మాత్రం కలిసొస్తుందో వేచి చూడాలి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.