close
Choose your channels

విజ‌య్ స్టోరీ ఇదేనంటూ హ‌ల్‌చ‌ల్‌

Sunday, February 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజ‌య్ స్టోరీ ఇదేనంటూ హ‌ల్‌చ‌ల్‌

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ త‌దుప‌రి అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. థెరి, మెర్స‌ల్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కే ఈ చిత్రంలో విజ‌య్ కోచ్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నార‌నే సంగ‌తి కూడా తెలిసిందే.

అయితే ఈ సినిమా క‌థ ఇదేనంటూ సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు వెలువ‌డ్డాయి. దాని ప్ర‌కారం సినిమాలో విజ‌య్ కోచింగ్ ఇచ్చే టీం స‌భ్యుల‌ను ఎవ‌రో హ‌త్య చేస్తుంటారు. దానికి కోచ్ విజ‌య్ కార‌ణ‌మంటూ పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేస్తారు. ఆ నేరం నుండి విజ‌య్ ఎలా త‌ప్పించుకున్నాడ‌నేదే క‌థ అని టాక్‌. ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస‌తుంటే ఎ.ఆర్‌.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.