close
Choose your channels

హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో సాయిధ‌ర‌మ్ చిత్రం

Friday, January 19, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుప్రీమ్ త‌రువాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక‌పోయాయి. ప్రస్తుతం వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఇంటెలిజెంట్' చిత్రాన్ని చేస్తున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. లావణ్య త్రిపాఠి నాయికగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ చిత్రం త‌రువాత కరుణాకరన్ డైరెక్షన్లో సాయిధ‌ర‌మ్ న‌టిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా కోసం.. అనుపమ పరమేశ్వరన్ తొలిసారిగా సాయిధరం తేజ్ సరసన నటిస్తోంది. ఈ రొమాంటిక్ ఫిలింని హాలీవుడ్ మూవీ 'ది వౌ'ని స్పూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ కథ ఒక కారు యాక్సిడెంట్ చుట్టూ తిరుగుతూ.. ఎన్నో ట్విస్ట్ లతో ఆసక్తికరంగా ఉండనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో కరుణాకరన్ మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లతో సినిమాల‌ను రూపొందించిన సంగ‌తి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.