close
Choose your channels

సీక్వెల్‌కు సల్మాన్ రెడీ!

Tuesday, April 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీక్వెల్‌కు సల్మాన్ రెడీ!

తమిళ్‌లో విక్రమ్ హీరోగా బాల దర్శకత్వంలో రూపొందిన 'సేతు' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ తెలుగులో 'శేషు'గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2003లో సల్మాన్ ఖాన్‌తో సతీష్ కౌశిక్ హిందీలో 'తేరే నామ్' పేరుతో 'సేతు'చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇది బాలీవుడ్‌లో పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

కాగా, 16 సంవత్సరాల తర్వాత 'తేరే నామ్' చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు సతీష్ కౌశిక్ సిద్ధవువుతున్నారు. 'సేతు' చిత్రానికి సీక్వెల్ చేయనప్పటికీ హిందీలో మాత్రం సీక్వెల్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన 'తేరేనామ్' బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

సల్మాన్‌ఖాన్‌కు నటుడుగా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో అతని హెయిర్ స్టైల్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మరి సీక్వెల్‌లో సల్మాన్, సతీష్ ఎలాంటి అద్భుతాలు చేస్తారో, మరోసారి ప్రేక్షకుల్ని ఏవిధంగా ఆకట్టుకుంటారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.