close
Choose your channels

'స‌వ్య‌సాచి' రీమిక్స్ షూటింగ్ ఎప్పుడంటే..

Monday, June 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`స‌వ్య‌సాచి` రీమిక్స్ షూటింగ్ ఎప్పుడంటే..

'నిన్ను రోడ్డు మీద చూసినాది ల‌గ్గాయ‌త్తుస‌.. `అల్ల‌రి అల్లుడు` (1993) చిత్రం కోసం నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌పై చిత్రీక‌రించిన ఈ పాట ఎంత సంచ‌ల‌న‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌ళ్ళీ 25 ఏళ్ళ త‌రువాత ఈ పాట రీమిక్స్ రూపంలో సంద‌డి చేయ‌నుంది. నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం స‌వ్య‌సాచి కోసం ఈ పాట‌ను రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నెలాఖ‌రు నుంచి నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నాపై ఈ ప్ర‌త్యేక గీతం చిత్రీక‌ర‌ణ జ‌రుగనుంది. ఈ పాట పూర్తికావ‌డంతో స‌వ్య‌సాచి నిర్మాణం పూర్త‌యిన‌ట్టే. మ‌రో వైపు ఈ సినిమాకి సంబంధించిన విజువ‌ల్ ఎఫెక్ట్స్ మకుట సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్నాయి. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై నెలాఖ‌రులో విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.