close
Choose your channels

'షాలిని' సినిమా పాటలు విడుదల

Friday, April 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమోఘ్ దేశ్ పతి,అర్చన,శ్రేయ వ్యాస్ నటీనటులుగా "లయన్" సాయి వెంకట్ సమర్పణలో స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై..నిర్మాత పి.వి. సత్యనారాయణ నిర్మించిన చిత్రం షాలిని. ఈ చిత్రం పాటలు ఇటీవల ప్రసాద్ ల్యాబ్ లో ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి ముఖ్య అతిధిగా పాటల సి.డి ని ఆవిష్కరించి మొదటి సి.డి ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఆర్.కె గౌడ్ కి అందించారు.
ఈ సందర్బంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ..సినిమాకు షాలిని పేరు చాల బాగుంది.అలాగే పాటలు బాగున్నాయి,నిర్మాత సత్యనారాయణ కు మరియు దర్శకుడు షెరాజ్ కు మంచి పేరుతెచ్చిపెట్టాలి.చిన్న సినిమాలు ఎక్కువగా రావాలి అప్పుడే ఎక్కువమంది సినీ కార్మికులకు ఉపాధి లభిస్తుంది.సి.యం కె.సి.ఆర్ సినిమా పరిశ్రమను ఆదుకుంటాం అని చెప్పారు.2000 ఎకరాలలో ఫిలిం సిటీ ప్రభుత్వమే నిర్మించనుంది. ఈ సినిమా కు పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
ఆర్ కె గౌడ్ మాట్లాడుతూ..సినిమా పబ్లిసిటీ విషయంలో కాంప్రమైజ్ కానీ వ్యక్తి సాయి వెంకట్ ఈ సినిమా ను రిలీజ్ చేయడం తో మంచి పబ్లిసిటీ వస్తుంది.విజువల్స్ మరియు పాటలు బాగున్నాయి.ఇప్పుడు హారర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి తప్పకుండ విజయం సాధిస్తుంది.టీం అందరికి అభినందనలు.నిర్మాత పి.వి సత్యనారాయ మాటాడుతూ..మా షాలిని దర్శకుడు షేరాజ్ చాల బాగా తీసాడు.సాయి వెంకట్ గారు మా సినిమా రిలీజ్ చేయడం మా అదృష్టం.
సమర్పకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ..ఈ సినిమా చూసాకే రిలీజ్ చేస్తానని చెప్పాను.సినిమా చూసాక రిలీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నాను.అంత బాగా తీసాడు దర్శకుడు.అన్ని అంశాలు ఉన్న సినిమా షాలిని హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ ఇది .షేరాజ్ కి మంచి భవిష్యత్తు ఉంది తనతో ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తా అన్నారు.
హీరో అమోఘ్ దేశ్ పతి మాట్లాడుతూ ..తక్కువ టైం లో తీసిన సినిమా షాలిని.బాగావచ్చింది.పాటలుచాల బాగావచ్చాయి.నవనీత్ చారీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇది ప్రేక్షకుల్ని తప్పకుండ అలరిస్తుంది. దర్శకుడు షేరాజ్....షాలిని డిఫరెంట్ మూవీ ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తుంది.లవ్,రొమాంటిక్,హారర్ థ్రిల్లర్. హైదరాబాద్,వైజాగ్. గోవా లో షూటింగ్ చేసాం.అన్నారు
ఈ కార్యక్రమానికి సాంకేతిక నిపుణులు ..భాష్య శ్రీ.రాజ్ నజీర్.బాల సతీష్.నవనీత్ చారి శ్రేయ వ్యాస్ .అతిధులు రామానుజం,గోపి ధన్,వేణు మాధవ్,ఓం ప్రకాష్.నజీర్,టి న్యూస్ రాజేష్,బుచ్చిరెడ్డి,సయ్యద్ యాకుబ్,సయ్యద్ మూస,షీ టీం లక్ష్మి పాల్గొన్నారు. ఆడియో శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదల అయింది

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.