close
Choose your channels

సైమా విజేతల వివరాలు...

Friday, July 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో గ‌త సంవ‌త్స‌రం విడుద‌లైన చిత్రాల‌కు గాను ప్ర‌తి సంవ‌త్సరం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇచ్చే సైమా అవార్డ్స్ వేడుక‌ను ఈ సంవ‌త్స‌రం సింగ‌పూర్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. జూన్ 30న సింగ‌పూర్ లో జ‌రిగిన ఈ వేడుక‌కు సౌతిండియా సినీ ప్ర‌ముఖులు హాజ‌రై సంద‌డి చేసారు. తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్‌, అక్కినేని అఖిల్, రానా, వరుణ్‌తేజ్‌, రాజేంద్రప్రసాద్‌, శ్రుతిహాసన్‌, స‌మంత‌, ప్రణీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉత్త‌మ చిత్రం - బాహుబ‌లి
ఉత్తమ దర్శకుడు - ఎస్‌.ఎస్‌. రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ నటుడు - మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి - శ్రుతిహాసన్ (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయనటుడు - రాజేంద్రప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయనటి - రమ్యకృష్ణ (బాహుబలి)
ఉత్తమ ప్రతినాయకుడు - రానా దగ్గుబాటి(బాహుబలి)
ఉత్తమ హాస్యనటుడు - వెన్నెలకిషోర్ (భలే భలే మగాడివోయ్‌)
ఉత్తమ నటుడు (తొలి పరిచయం) - అక్కినేని అఖిల్ (అఖిల్‌)
ఉత్తమ నటి (తొలిపరిచయం) - ప్రగ్యా జైశ్వాల్ (కంచె)
ఉత్తమ నిర్మాత (తొలి పరిచయం) - విజయ్‌రెడ్డి, శశిదేవ్‌రెడ్డి(భ‌లే మంచిరోజు)
ఉత్తమ దర్శకుడు(తొలి పరిచయం) - అనిల్ ర‌విపూడి (పటాస్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ నేపథ్య గాయకుడు - సాగర్ (జతకలిసే.. శ్రీమంతుడు)
ఉత్తమ నేపథ్య గాయని - సత్యయామిని(మమతల తల్లి.. బాహుబలి)
ఉత్తమ గీత రచయిత - సిరివెన్నెల సీతారామశాస్త్రి (కంచె)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - జానీ (టెంపర్‌)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్‌కుమార్ (బాహుబలి)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్) - అల్లు అర్జున్‌( రుద్రమదేవి)
ఉత్తమ నటి(క్రిటిక్స్‌)- అనుష్కశెట్టి (రుద్రమదేవి)
జీవిత సాఫల్య పురస్కారం- ఎస్‌. జానకి
యూత్‌ ఐకాన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా- సమంత
సౌత్‌ సెన్సేషన్‌ ఆఫ్‌ ది ఇయర్ - సుధీర్‌బాబు
ఈ ఏడాది బాగా ప్రసారం అయిన పాట - రామ రామ(శ్రీమంతుడు)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.