close
Choose your channels

నిద్రపోయి పాపులర్ అయ్యాడు.. తీరా చూస్తే..!

Wednesday, April 1, 2020 • తెలుగు Comments

నిద్రపోయి పాపులర్ అయ్యాడు.. తీరా చూస్తే..!

టైటిల్ చూడగానే.. ఇదేంటి ఇందులో విచిత్రం ఏముంది..? అందరికీ నిద్రొస్తుంది.. నిద్రపోతారు కదా.. ఇందులో కొత్త విషయం ఏముంది అనుకుంటున్నారా..? అవును ఇందులో కొత్త విషయమే ఉంది.. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్పెషల్ ఆర్టికల్ చదవాల్సిందే మరి.

ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు టిక్‌టాక్‌‌లో యమా యాక్టివ్‌గా ఉంటాడు. నిత్యం టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇతనిది చైనాలోని చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌. కరోనా మహమ్మారి కాటేస్తున్న సమయంలోనూ వీడియోలు చేస్తూ ఉన్నాడు. అలా వీడియోలు చేస్తూ వచ్చిన యువకుడు ఇవాళ ఏం వీడియో చేద్దామా..? అని ఆలోచించి నిద్రపోతూ లైవ్ స్ట్రీమ్ పెట్టేశాడు. అసలు తాను నిద్రపోతున్నప్పుడు గురక వస్తుందా..? రాదా..? అని తెలుసుకోవాలనుకున్నాడు. దీంతో నిద్రపోయే ముందు లైవ్ పెట్టేసి పడుకున్నాడు.

తీరా చూస్తే.. ఈ లైవ్‌ వీడియోను సుమారు లక్షలాది మంది చూసేశారు. దీంతో ఇది చూసిన ఆ కుర్రాడే షాకయ్యాడు. ఈ వీడియోతో ఆ కుర్రాడు తెగ పాపులర్ అయిపోయాడు. అంతేకాదు దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్స్ మారారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కుర్రాడు పాపులర్ స్టార్‌గా మారిపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ కుర్రాడు ఇదివరకు పెట్టిన వీడియోల కంటే.. తాజాగా పెట్టిన ఈ నిద్ర వీడియోతో తెగ పాపులర్ అయిపోయాడు. సో.. ఇలా కూడా పాపులర్ అవ్వొచ్చన్న మాట.

Get Breaking News Alerts From IndiaGlitz