close
Choose your channels

త్వరలో జనసేనలోకి ఊహించని నేత..!?

Friday, January 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్వరలో జనసేనలోకి ఊహించని నేత..!?

ఏపీకి చెందిన ఓ కీలక నేత జనసేన గూటికి చేరుతున్నారా..? ఈ చేరికపై ఇప్పటికే ఓ కీలక నేత మధ్యవర్తిగా వచ్చి చర్చలు జరిపారా..? పార్టీలో కీలక పదవి ఇవ్వడానికి పవన్ సిద్ధమయ్యారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి నెల చివరికల్లా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన కండువా కప్పుకుంటారా..? అంటే తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి.

రిటైర్మెంట్‌కు ఇంకా గడువు ఉన్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి మరీ.. ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటించిన లక్ష్మీ నారాయణ మొదట కొత్త పార్టీ పెట్టాలని భావించారు. అయితే ఇప్పట్లో పార్టీ పెట్టి దాన్ని నడిపే పరిస్థితుల్లేవని ఏదో పార్టీలోకి చేరాలని నిర్ణయించి లోక్‌సత్తాలోకి వెళ్లాలని అనుకున్నారు. అయితే పత్తా లేని లోక్‌సత్తా చేరడమేంటని కొందరు సన్నిహితులు ఆయనకు రాజకీయం కాసింత నూరిపోయడంతో కొద్దిరోజుల పాటు ఎక్కడా వార్తల్లో కనిపించకుండానే పోయారు. అయితే ఈ గ్యాప్‌‌లో జనసేనకు చెందిన ఓ కీలక నేత లక్ష్మీనారాయణ ఇంటికెళ్లి తమ పార్టీలో చేరితే భవిష్యత్ ఉంటుందని ఆహ్వానించారని టాక్. అంతేకాదు ఆయనే దగ్గరుండి అటు మాజీ జేడీ.. ఇటు పవన్‌తోనూ అన్ని మంతనాలు జరిపారని సమాచారం. పార్టీలో చేరితే కీలక పదవి అప్పగిస్తారని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని లక్ష్మీ నారాయణకు స్పష్టమైన ఇచ్చినట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి చివరికల్లా పవన్ సమక్షంలో లక్ష్మీ నారాయణ జనసేన కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలుమార్లు ఆయన జనసేనలో చేరతారని పుకార్లు వచ్చినప్పటికీ అవన్నీ అబద్ధమే అని కొట్టి పారేశారు. అయితే తాజా పుకార్లపై మాజీ జేడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే లక్ష్మీనారాయణతో పాటు మరో మాజీ జేడీ కూడా జనసేన తీర్థం పుచ్చుకుంటారని పుకార్లు వస్తు్న్నాయి.

ఏపీలో ప్రస్తుతం బలంగా ఉండే పార్టీల్లో టీడీపీ, వైసీపీ తర్వాత జనసేన ఉన్నది. ఎలాగూ లక్ష్మీ నారాయణ.. జగన్, చంద్రబాబు పార్టీలోకి వెళ్లే అవకాశాల్లేవ్.. వెళ్లడానికి కూడా సాహసించరు. ఇక మిగిలింది జనసేనలో చేరడమా లేకుంటే కొత్త పార్టీ ఏర్పాటు చేయడమా? పవన్-లక్ష్మీనారాయణ భావజాలాలు ఇంచుమించు ఒక్కటేలా ఉంటాయి. అందుకే ఆయనొస్తే మనకే మంచిదేనని పవన్.. జనసేనలో చేరితే పరిస్థితేంటని ఇద్దరూ ఆలోచనలో పడ్డారట. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముంది..? అసలేం జరగబోతోంది..? ఈ నెల చివర్లో నిజంగానే జనసేనలో చేరతారా..? లేకుంటే ఏ పార్టీ వద్దనుకుని జాతీయ పార్టీల్లో చేరతారా..? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే లక్ష్మీ నారాయణ మీడియా ముందుకు రావాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.