close
Choose your channels

నాన్నగారిని కలిశాను.. నన్ను గుర్తుపట్టి మాట్లాడారు: ఎస్పీ చరణ్

Tuesday, August 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాన్నగారిని కలిశాను.. నన్ను గుర్తుపట్టి మాట్లాడారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కాస్త కోలుకుంటున్నారని తెలుస్తోంది. ఎస్పీ బాలు ఆరోగ్యం విషయమై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఓ వీడియోను విడుదల చేశారు. తన తండ్రిని రెండు వారాల తర్వాత కలిశానని తనను చూసి గుర్తు పట్టడమే కాకుండా కొంచెం మాట్లాడారని చరణ్ వెల్లడించారు. అయితే ఇంకా ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే ఎస్పీ బాలు గురించి చేస్తున్న ప్రార్థనల గురించి కూడా తాను ఆయనకు తెలిపానని చరణ్ వెల్లడించారు.

దాదాపు రెండు వారాల తర్వాత తన తండ్రిని కలిశానని.. తనను చూసి గుర్తుపట్టి.. కొంచెం మాట్లాడారని ఎస్పీ చరణ్ తెలిపారు. ఎలా ఉన్నారని అడిగానన్నారు. ఆయన కోలుకోవాలంటూ అందరూ చేస్తున్న ప్రార్థనల గురించి కూడా తెలిపానన్నారు. సాధ్యమైనంత త్వరగా కోలుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు బాలుకి వెల్లడించానన్నారు. అయితే ఆయన సంకేతాల ద్వారా మాట్లాడారని.. తను చెప్పిన విషయాలకు బొటన వేలుతో సంకేతాలు ఇచ్చారన్నారు. తన గురించి, తన తల్లి గురించి కూడా అడిగారన్నారు. తనను చూసినందుకు తన తండ్రి ఆనందించి ఉంటారని పేర్కొన్నారు. ఇక మీదట తరచూ వెళ్లి కలుస్తానని వెల్లడించారు. తన తండ్రి కచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తారని.. త్వరలోనే అందరినీ చూస్తారని చరణ్ వెల్లడించారు.

నిన్న ఎస్పీ బాలుకి కరోనా నెగిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన గురించి చరణ్ మాట్లాడుతూ.. ‘‘ఎంజీఎం ఆసుప్రతికి సంబంధించిన మెడికల్ టీంను సంప్రదించిన అనంతరమే నేను సాధారణంగా నా తండ్రి హెల్త్ అప్‌డేట్‌ను ఇస్తుంటాను. కానీ దురదృష్టవశాత్తు ఉదయం నుంచి ఓ పుకారు షికారు చేస్తోంది. నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా నేనే ఇస్తూ ఉంటాను. కానీ ఇవాళ నాన్నగారికి కరోనా నెగిటివ్ వచ్చిందంటూ ఓ రూమర్ వైరల్ అవుతోంది. నాన్నగారికి కరోనా నెగిటివా? పాజిటివా? అనేది పక్కనబెడితే.. ఆయన లైఫ్ సపోర్ట్ పైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అది కోలుకునేందుకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నా’’ అని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.