close
Choose your channels

వరుణ్ తేజ్ 'మిస్టర్ ' యూనివర్సల్ గా అందరికీ నచ్చుతాడు - శ్రీనువైట్ల

Thursday, March 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మిస్ట‌ర్ అంటే మంచి మ‌న‌సున్న‌వాడు. వ‌రుణ్‌తేజ్‌లోని అన్నీ కోణాల‌ను మా మిస్ట‌ర్ సినిమాలో చూపిస్తున్నాం అని అన్నారు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్ట‌ర్‌`. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో హీరో వ‌రుణ్‌తేజ్‌, శ్రీనువైట్ల‌, న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. శ్రీనువైట్ల ఇంకా మాట్లాడుతూ మిస్ట‌ర్ సినిమా జ‌ర్నీ 9 తొమ్మిది నెల‌ల పాటు సాగింది. ట్రావెల్ మూవీ, ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ కూడా. అన్నీ ఎమోష‌న్స్ ఉంటాయి. ఇదొక ట్రావెల్ ఫిలిం. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ. ల‌వ్‌, కామెడి స‌హా అన్నీ ఎమోష‌న్స్‌తో సినిమాను తెర‌కెక్కించాం. ఇందులో బ‌క‌రా కామెడి క‌న‌ప‌డ‌దు. సీనియ‌ర్ కమెడియ‌న్స్‌కు రీప్లేస్‌మెంట్ క‌మెడియ‌న్స్‌ను చూస్తారు. ఈ సినిమాతో వ‌రుణ్ తేజ్ అంద‌రికీ ఇంకా బాగా క‌నెక్ట్ అవుతాడు. మిక్కి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చాడు. గోపీమోహ‌న్ క‌థ‌, శ్రీద‌ర్ సీపాన మాట‌లు, గుహ‌న్‌గారి సినిమాటోగ్ర‌ఫీ ఇలా అన్ని అద్భుతంగా కుదిరాయి. బుజ్జిగారు, మ‌ధుగారు ఇచ్చిన స్వేచ్ఛ‌తో సినిమాను చ‌క్క‌గా తీయ‌గ‌లిగాను. సినిమాకు ప‌నిచేసిన అంద‌రూ ప్రేమ‌తో ప‌నిచేశారు. మంచి సినిమా చేశాం. యూనివ‌ర్సల్‌గా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. స్పెయిన్‌లో 11 సిటీస్‌లో సినిమాను చిత్రీక‌రించాం. అలాగే చిక్‌మంగ‌ళూరు, ఊటీ, కేర‌ళ‌లో సినిమాను షూట్ చేశాం. సినిమా ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుందని తెలిపారు.

మంచి టీం కుద‌ర‌డం వ‌ల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. అంద‌రూ మంచి సినిమా తీయాల‌నే ప్ర‌య‌త్నిస్తారు. మేం కూడా ఒక మంచి సినిమానే తీశాం. ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌గారు, నిర్మాతలు బుజ్జి, మ‌ధుగారి స‌పోర్ట్ మ‌ర‌చిపోలేం. నిర్మాత‌లు నా తొలి సినిమా నుండి ట్రావెల్ అవుతున్నారు. అంద‌రూ మంచి సినిమా చేయాలని చేసిన ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయ్యింది. నా క్యారెక్ట‌ర్ ప‌రంగా శ్రీనువైట్ల‌గారు ఎంతో కేర్ తీసుకున్నారు. ప్రేక్ష‌కులకు న‌చ్చే కామెడి, ఫైట్స్, మ్యూజిక్ అన్నీ ఎలిమెంట్స్ మిళిత‌మైన సినిమా. కామెడి సినిమాను చేయ‌డంలో శ్రీనువైట్ల‌గారిది ప్ర‌త్యేక‌మైన శైళి, ఈ సినిమాలో కామెడి చేశాను.

మిస్ట‌ర్‌లాంటి ఓ మంచి సినిమాతో ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాం అని వ‌రుణ్‌తేజ్ చెప్పారు. చంద్ర‌ముఖి అనే క్యారెక్ట‌ర్ చేశాను. శ్రీనువైట్ల‌గారితో, వ‌రుణ్ తేజ్‌తో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంద‌ని, మ‌న‌సుకు ద‌గ్గ‌రైన క్యారెక్ట‌ర్ చేశాన‌ని లావ‌ణ్య త్రిపాఠి చెప్ప‌గా, మీరా అనే క్యారెక్ట‌ర్ చేయ‌డం మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింద‌ని హెబ్బా ప‌టేల్ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత హ‌రి పాల్గొన్నారు.

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బాప‌టేల్, ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, ర‌ఘుబాబు, ఆనంద్‌, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, నాగినీడు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, నికిత‌న్‌ధీర్‌, ష‌ఫీ, శ్ర‌వ‌ణ్‌, మాస్ట‌ర్ భ‌ర‌త్‌, షేకింగ్ శేషు, ఈశ్వ‌రిరావు, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, తేజ‌స్విని త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, స్టైలింగ్ః రూప వైట్ల‌, లిరిక్స్ః కె.కె, రామ‌జోగ‌య్య శాస్త్రి, కోడైరెక్ట‌ర్స్ః బుజ్జి, కిర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః కొత్త‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌, క‌థః గోపీ మోహ‌న్‌, మాట‌లుః శ్రీధ‌ర్ సీపాన‌, సంగీతంః మిక్కి జె.మేయ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః కె.వి.గుహ‌న్‌, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, నిర్మాత‌లుః న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీనువైట్ల‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.