close
Choose your channels

సినిమాల‌తోనే హ్యాపీ అంటు స్టార్

Thursday, September 6, 2018 • తెలుగు Comments

సినిమాల‌తోనే హ్యాపీ అంటు స్టార్ 

కొన్ని రోజుల ముందుగా మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ .. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌మోదీని క‌లుసుకున్నారు. త‌ను చేస్తున్న చారిటీ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. అయితే మోహ‌న్‌లాల్ రాజ‌కీయాల్లోకి రాబోతున్నార‌ని.. బిజెపి త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోక్‌స‌భ త‌ర‌పున పోటీ చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే ఈ వార్త‌ల‌న్నీ మోహ‌న్‌లాల్ కొట్టిపారేశారు. అన‌వ‌స‌ర‌మైన వార్త‌ల‌పై స్పందించ‌న‌ని చెప్పిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం సినిమాల‌తో హ్యాపీగానే ఉన్నాను. రాజ‌కీయాల్లోకి వెళ్లే ఆలోచ‌న లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఈయ‌న మ‌ల‌యాళ సినిమాల్లో కాకుండా త‌మిళంలో సూర్య సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.