close
Choose your channels

'సుబ్రమణ్యం ఫర్ సేల్' శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న...

Tuesday, September 1, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రేయ్` తొలి సినిమాగా స్టార్టయినా పిల్లా నువ్వులేని జీవితం` ముందుగా రిలీజ్ కావడం పెద్ద హిట్ కావడం సాయిధరమ్ తేజ్ కి బాగా కలిసి వచ్చింది. వెంటనే దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్ సేల్` సినిమాలో నటించేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. మంచి క్రేజీ కాంబినేషన్ తోరూపొందిన ఈ సినిమా బిజినెస్ అప్పుడే పూర్తయిపోయిందట.

అంతే కాకుండా శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటుకే అమ్ముడైపోయాయని టాక్. ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు మా టీవీ సంస్థ ఈ సినిమా శాటిలైట్ హక్కులను దాదాపు నాలుగు కోట్ల రూపాయాలతో చేజిక్కించుకున్నారట. మూడో సినిమాకే మంచి మార్కెట్ రావడం ఓ రకంగా సాయిధరమ్ అదృష్టమనే చెప్పాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.