close
Choose your channels

‘సుల్తాన్’ టీజర్: అదే కృష్ణుడు కౌర‌వుల వైపుంటే?

Monday, February 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘సుల్తాన్’ టీజర్: అదే కృష్ణుడు కౌర‌వుల వైపుంటే?

స్టార్ హీరో కార్తీ, బక్కియరాజ్ కణ్ణన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘సుల్తాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు విడుదలైంది. ఒక నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్‌ను చాలా ఆసక్తికరమైన డైలాగ్స్‌తో కట్ చేశారు. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రష్మికను సైతం హాఫ్ శారీలో పల్లెటూరి యువతిలా చాలా అందంగా చూపించారు.

‘మ‌హాభారతం చ‌దివావా? భార‌తంలో కృష్ణుడు వంద అవ‌కాశాలిచ్చినా కౌర‌వులు మార‌లేదు. నువ్వు ఇవ్వ‌మంటోంది ఒక్క అవ‌కాశ‌మే క‌దా. ఇస్తా’ అని కార్తీతో ఓ పోలీసాఫీస‌ర్ క్యారెక్ట‌ర్ అన‌డంతో టీజర్ ప్రారంభమవుతుంది. దీనికి కార్తీ చెప్పే డైలాగ్ సైతం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘మ‌హా భార‌తంలో కృష్ణుడు పాండ‌వుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌర‌వుల వైపుంటే? అదే మ‌హాభార‌తాన్ని ఒక‌సారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సార్’ అని స‌మాధాన‌మివ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. టీజర్‌లో కార్తీ కూడా చాలా క్లాస్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.

టీజర్ ప్రకారం చూస్తే కౌరవుల్లాంటి విలన్స్‌ను ఒక యువకుడు ఎలా ఎదుర్కొన్నాడనే ఆసక్తికర కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్ర‌రాజు ('కేజీఎఫ్' ఫేమ్‌) కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రూపొందుతోంది. ఈ టీజర్ ద్వారానే చిత్రబృందం రిలీజ్ డేట్‌ను సైతం అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా టీజర్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన రష్మిక.. ఈ చిత్రం పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలిపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.