close
Choose your channels

సూర్య 24 ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Tuesday, November 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ అండ్ 2డి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను 24వ తారీఖు అయిన ఈరోజు ట్విట్ట‌ర్ లో సూర్య రిలీజ్ చేసారు. ఇందులో సూర్య ర‌ఫ్ గా డాన్ లా ఓ స్టిల్...సైంటిస్ట్ లా రెండో స్టిల్ రిలీజ్ చేసారు. ఫ‌స్ట్ లుక్ తో 24 మూవీపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతాన్నిఅందిస్తున్నారు. సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ లేటెస్ట్ గా స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. మ‌రి...విభిన్న క‌థా చిత్రాల‌ను అందించే విక్ర‌మ్ కుమార్ 24 మూవీ ద్వారా ఏం చెబుతున్నార‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.