close
Choose your channels

దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సూర్య‌..!

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ హీరో కార్తి కాష్మోరా సినిమాతో దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి...సూర్య దీపావ‌ళికి రావ‌డం ఏమిటి అనుకుంటున్నారా..? సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం సింగం 3. ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. సింగం, సింగం 2 చిత్రాలు సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డంతో సింగం 3 గా వ‌స్తున్న ఎస్ 3 మూవీ పై తెలుగు, త‌మిళ్ లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ భారీ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక దీపావ‌ళికి కానుకగా ఎస్ 3 టీజ‌ర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 16న రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.