close
Choose your channels

బిగ్‌బాస్‌4 హోస్ట్‌ ఆయనేనా?

Monday, November 4, 2019 • తెలుగు Comments

బిగ్‌బాస్‌4 హోస్ట్‌ ఆయనేనా?

తెలుగు రియాలిటీ షోస్‌లో బిగ్‌బాస్‌ బాగా క్లిక్‌ అయ్యింది. పలు వివాదాలు.. ఆసక్తికరమైన మలుపులతో సాగే బిగ్‌బాస్‌ షోకి క్రేజ్‌ అంతకంతకు పెరుగుతుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 2కి అంత క్రేజ్‌ లేకపోయినా.. సీజన్‌ 3కి నాగార్జున వ్యాఖ్యానం చాలా కీలకంగా మారింది. షో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అయ్యింది. అసలు నాగార్జున ఎలా చేస్తాడో అనే విషయం నుండి చాలా బాగా చేశాడనే వరకు వెళ్లింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న అందరిలోనూ మొదులుతుంది.  సినీ వర్గాల సమాచారం మేరకు బిగ్‌బాస్‌ 4 షోకి మెగాస్టార్‌ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవరించనున్నారట.

బిగ్‌బాస్‌ 3 ఫైనల్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్‌ .. సీజన్‌ 4కి హోస్ట్‌గా మారే అవకాశాలున్నాయట. అందుకు కారణంగా సీజన్‌ 4ని రన్‌ చేసే వ్యాఖ్యాత లేడు. సీజన్‌ 3ని హోస్ట్‌ చేసిన నాగ్‌.. సీజన్‌ 4కి అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్లేస్‌ను చిరంజీవి మాత్రమే రీప్లేస్‌ చేయగలడు. కాబట్టి నిర్వాహకులు చిరు వైపుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌కి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన తర్వాత చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పుడు అదే స్ట్రాటజీతో మెగాస్టార్‌ చిరంజీవి బిగ్‌బాస 4ని హోస్ట్‌ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz