close
Choose your channels

మాస్ రాజాతో మిల్కీ బ్యూటీ..!!

Monday, March 16, 2020 • తెలుగు Comments

మాస్ రాజాతో మిల్కీ బ్యూటీ..!!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం క్రాక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ర‌వితేజ‌. ఈ సినిమా త‌ర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ట్రాక్ ఎక్క‌క ముందే డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడు. క్రాక్ త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ‌, వ‌క్కంతం వంశీ సినిమాల‌ను ఒకేసారి స్టార్ట్ చేస్తాడా? లేక గ్యాప్ తీసుకోకుండా ఏక‌ధాటిగా రెండు సినిమాల‌ను పూర్తి చేస్తాడా? అనేది తెలియ‌డం లేదు. వీటి మ‌ధ్య‌లో త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడు. అయితే క్రాక్ త‌ర్వాత ర‌వితేజ ఏ సినిమా స్టార్ట్ చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

మాస్ రాజాతో మిల్కీ బ్యూటీ..!!

తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ చేయ‌బోయే సినిమాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నాను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి బెంగాల్ టైగ‌ర్ సినిమాలో జోడీ క‌ట్టారు. అంతా ఓకే అయితే మ‌రోసారి ఈ జోడి వెండితెర‌పై అల‌రిస్తుంది. ప్ర‌స్తుతం త‌మ‌న్నా గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో సీటీమార్ సినిమాలో న‌టిస్తుంది.

Get Breaking News Alerts From IndiaGlitz