close
Choose your channels

Chandrababu:టీడీపీ నేతలను వేధిస్తున్నారు.. గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..

Friday, March 1, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రస్తావిస్తూ APSDRI దుర్వినియోగాన్ని ప్రస్తావించారు.

"ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. APSDRI ద్వారా టీడీపీ నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. APSDRIను ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోంది. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసుల పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అయినా APSRDI డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోంది" అన్నారు.

"కేంద్ర సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటలిజెన్స్ విచారణ చేస్తుండగానే మళ్లీ అదే అంశాన్ని APSRDI విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులను ప్రభుత్వం బనాయిస్తోంది. రాష్ట్రంలో APSDRI ఎందుకు స్థాపించారు.. దాని లక్ష్యాలు ఏమిటి? కేవలం టీడీపీ నేతలను వేధించడమే APSDRI పనా? APSDRI రాష్ట్రంలో ఏర్పడ్డాక ఎన్ని కేసులు నమోదు చేసింది? ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల పెట్టి వేధిస్తోంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా APSDRI ద్వారా ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే కుట్ర చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో APSDRI వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. APSDRIని దుర్వినియోగం చేసే ప్రభుత్వం చర్యను నిలువరించాలి" అని చంద్రబాబు కోరారు.

కాగా జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరచ్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos