close
Choose your channels

అందుకే నన్ను టీవీ 9 నుంచి తొలగించారు: బిత్తిరి సత్తి

Thursday, June 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందుకే నన్ను టీవీ 9 నుంచి తొలగించారు: బిత్తిరి సత్తి

ఓ మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించి.. వీ 6 ఇచ్చిన లిఫ్ట్‌తో బిత్తిరి సత్తిగా ఓ మంచి సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకున్నారు చేవెళ్ల రవి. తెలుగు రాష్ట్రాల్లో బిత్తిరి సత్తికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే వీ 6 నుంచి బయటకు వచ్చేసిన తరువాత మాత్రం ఆయన అనుకున్నంతగా రాణించలేకపోయారనే దానిలో సందేహం లేదు. వీ6లో తీన్‌మార్ పేరుతో వచ్చిన ప్రోగ్రాంలో బిత్తిరి సత్తిగా తనదైన ముద్ర వేసుకున్న రవి.. టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్ పేరుతో ప్రోగ్రాంను చేశారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

బిత్తిరి సత్తిని తాజాగా టీవీ 9 నుంచి తొలగించారు. దానికి కారణాలను ఓ ఇంటర్వ్యూలో బిత్తరి సత్తి పంచుకున్నారు. ‘‘ఆ ప్రోగ్రాంను హిట్ చేసేందుకు నేను చేయాల్సిందంత చేశాను. ఆ క్యారెక్టర్ కోసం 100 పర్సంట్ ఎఫర్ట్ పెట్టాను. నేను చేసిన షోలన్నీ చాలా సహజంగా ఉంటాయి దాని కోసం క్యారెక్టర్‌లో నేను ఒదిగిపోతాను. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్న ఫోటో చూపిస్తూ నేనొక ప్రోగ్రాం చేశాను. అది యాజమాన్యానికి నచ్చలేదు. ఒక ప్రోగ్రాం అద్భుతంగా వచ్చేందుకు.. ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆర్టిస్టులుగా క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాం. కానీ దానిని యాజమాన్యం తప్పుగా అర్థం చేసుకుంది. దీంతో నేను టీవీ 9 నుంచి బయటకు రావాల్సి వచ్చింది’’ అని బిత్తిరి సత్తి వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.