close
Choose your channels

గుణ‌శేఖర్ శ‌కుంత‌ల‌గా ఈ స్టార్ హీరోయిన్ క‌నిపించ‌నుందా..?

Monday, December 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గుణ‌శేఖర్ శ‌కుంత‌ల‌గా ఈ స్టార్ హీరోయిన్ క‌నిపించ‌నుందా..?

బ‌డ్జెట్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకుండా భారీ సెట్స్ వేసి చిత్రీక‌రించే ద‌ర్శ‌కుల్లో గుణ‌శేఖ‌ర్ ఒక‌డు. ఈయ‌న పేరు వింటే.. త‌ను చేయ‌బోయే సినిమా కోసం ఎలాంటి సెట్స్ వేస్తాడోన‌ని ప్రేక్ష‌కుడు ఆలోచిస్తాడు. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ఓ పౌరాణిక చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి రెడీ అయ్యాడు. ఆ సినిమానే ‘శాకుంత‌లం’. నిజానికి ముందు రానా టైటిల్ పాత్ర‌లో ‘హిర‌ణ్య క‌శ్య‌ప‌’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలో కోవిడ్ ప్ర‌భావం రావ‌డం, మ‌రో వైపు రానా కూడా బిజీగా ఉన్నాడు. త‌ను ఫ్రీ కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌టంతో ... ‘హిర‌ణ్య క‌శ్య‌ప‌’ సినిమా ఆగింది. దీంతో గుణశేఖర్ శాకుంతలం సినిమాను అనౌన్స్ చేశాడు.

మహాకవి కాళిదాసు రాసిన ప్రేమ కావ్యం శాకుంతలం ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారు. వెస్ట్రన్ భాషల్లోకి వెళ్లిన తొలి భారతీయ నాటకం ఇదే. 46 ఇతర పాశ్చాత్య భాషల్లోకి అనువాదం కూడా అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను కొత్త ఏడాది సంద‌ర్భంగా జ‌న‌వ‌రి మొద‌టి వారం నుంచి ఇస్తామ‌ని గుణ‌శేఖ‌ర్ అండ్ టీమ్ తెలియ‌జేసింది. లేటెస్ట్ దుష్యంత మ‌హారాజు, శ‌కుంత‌ల ప్రేమ‌క‌థ అయిన శాకుంత‌లం కావ్యంను సినిమాగా తెర‌కెక్కించ‌నున్నారు. కాగా.. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి సినిమాలో శ‌కుంత‌ల‌గా ఎవ‌రు న‌టిస్తార‌నేది అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. చాలా మంది పేర్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు, ఈ సినిమాలో శ‌కుంత‌లగా స‌మంత అక్కినేని న‌టిస్తుంద‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. మ‌రి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.