close
Choose your channels

విజ‌య్ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్

Sunday, June 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజ‌య్ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ఇప్పుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంట్లో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల‌కానుంది. త‌ర్వాత విజ‌య్ 64వ చిత్రం లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

కోలీవుడ్‌లో విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో విజ‌య్ డ్యూయెల్ రోల్‌లో క‌నిపిస్తార‌ట‌. అలాగే సినిమా కోసం ఇద్ద‌రు హీరోయిన్స్‌ను తీసుకోవాలనుకుంటున్నార‌ట‌. ఒక హీరోయిన్‌గా స‌మంత పేరు విన‌ప‌డుతుండ‌గా.. మ‌రో హీరోయిన్‌గా ర‌కుల్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.