close
Choose your channels

వెంకీ టీజ‌ర్ డేట్ ఫిక్సైయింది గురు..!

Wednesday, November 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విభిన్న క‌థా చిత్రాల అగ్ర హీరో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం గురు. ఈ చిత్రం అవార్డ్ విన్నింగ్ త‌మిళ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రానికి సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

వ‌చ్చేవారం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌నున్నారు. వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై శ‌శికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక గురు టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే...డిసెంబ‌ర్ 13 వెంకీ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా గురు టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. గురు చిత్రాన్ని జ‌న‌వ‌రి నెలాఖ‌రున రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.