close
Choose your channels

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం

Thursday, October 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా ఓపెనింగ్ ద‌స‌రా సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా వ‌చ్చారు.

టి సుబ్బిరామిరెడ్డి, నిర్మాత‌లు అల్లు అర‌వింద్, అశ్వినీదత్, బివిఎస్ఎన్ ప్ర‌సాద్,సి క‌ళ్యాణ్.. ద‌ర్శ‌కులు కే రాఘ‌వేంద్ర‌రావ్ మ‌రియు నాగ్ అశ్విన్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. క‌ళాబంధు టి సుబ్బిరామిరెడ్డి గారు హీరో హీరోయిన్ల‌పై తొలి షాట్ కు క్లాప్ కొట్ట‌గా.. అల్లు అర‌వింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభంతొలి షాట్ ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావ్ తెర‌కెక్కించారు. ఈ ప్రేమ‌క‌థాచిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ రామారావు స‌మ‌ర్పిస్తుండ‌గా.. కేఏ వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు.

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.