close
Choose your channels

విజ‌య్ దేవ‌ర‌కొండ వెబ్‌సిరీస్‌

Thursday, May 14, 2020 • తెలుగు Comments

విజ‌య్ దేవ‌ర‌కొండ వెబ్‌సిరీస్‌

ఇప్పుడు వెండితెర‌కు ధీటుగా డిజిట‌ల్ రంగానికి ప్రాధాన్య‌త పెరుగుతుంది. ఇది వ‌ర‌కు ఉన్న ప్రాధాన్య‌త క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌రింతగా పెరిగింది. దీంతో ప‌లువురు స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ అంద‌రూ వెబ్ సిరీస్‌ల్లో న‌టించ‌డానికి, రూపొందించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. తెలుగు విష‌యానికి వ‌స్తే నిర్మాత అల్లు అర‌వింద్ ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ కొన్ని వెబ్‌సిరీస్‌ల‌ను చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. అలాగే కింగ్ ఆఫ్ హిల్స్ అనే త‌న స్వంత బ్యాన‌ర్ కూడా ఉంది. ఇందులోనూ విజ‌య్ వెబ్ సిరీస్‌లు చేయాల‌నుకుంటున్నాడ‌ని టాక్‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన దొర‌సాని చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కేవీఆర్ మ‌హేంద్ర‌కు అప్ప‌గించాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దొర‌సాని స‌మయంలో మ‌హేంద్ర‌తో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యంతోనే విజ‌య్ దేవ‌ర‌కొండ వెబ్ సిరీస్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్వ‌క‌త్వంలోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz