close
Choose your channels

37 భాషల్లో విక్రమ్ భారీ బడ్జెట్ మూవీ

Tuesday, January 30, 2018 • తెలుగు Comments

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో త‌మిళ క‌థానాయ‌కుడు విక్ర‌మ్ తెలుగువారికి సుప‌రిచిత‌మే. అప‌రిచితుడు త‌రువాత విక్ర‌మ్ ప‌లు త‌మిళ అనువాద చిత్రాల‌తో సంద‌డి చేసినా.. అవేవీ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అతి త్వ‌ర‌లో ఆయ‌న స్కెచ్ చిత్రంతో ప‌ల‌క‌రించబోతున్నారు. ఇదిలా ఉంటే.. రూ.300 కోట్ల బ‌డ్జెట్‌తో మ‌హావీర్ క‌ర్ణ్ పేరుతో రూపొంద‌నున్న ఓ భారీ బ‌డ్జెట్ మూవీలో విక్ర‌మ్ న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్‌.ఎస్‌.విమ‌ల్ అనే మల‌యాళ చిత్ర ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమా అక్టోబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఈ సినిమాని ఏకంగా 37 భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశార‌ని తెలిసింది. భార‌తీయ భాష‌ల‌తో పాటు అంత‌ర్జాతీయ భాష‌ల్లోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉండేలా విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెలువ‌డుతాయి.