close
Choose your channels

ఆ ఇద్దరిలో ఎవరితో?

Wednesday, March 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్‌కు `హ‌లో` సినిమా కాస్త బ్రేక్ వేసింది. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అఖిల్ న‌టించిన `హలో సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర విజ‌యాన్ని అందుకోలేదు. ఇప్పుడు విక్ర‌మ్ కుమార్ ఏ హీరోతో సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్వ‌నీద‌త్ నిర్మాణంలో సినిమా రూపొంద‌నుంది.
అయితే ఈ సినిమాలో హీరోగా నాని లేదా శ‌ర్వానంద్ న‌టిస్తాడా? అనే దానిపై ఇంకా స‌మాచారం లేదు. ఎందుకంటే నాని ఇప్పుడు నాగార్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌బోతున్నాడు. అలాగే శ‌ర్వానంద్ హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా త‌ర్వాత సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వ‌లో సినిమా చేయబోతున్నాడు. వీరిద్ద‌రి క‌మిట్‌మెంట్స్ పూర్త‌య్యే వర‌కు విక్ర‌మ్ కుమార్ ఆగాల్సి వ‌స్తుంది మ‌రి. చివ‌ర‌కు ఏ హీరోతో సినిమా చేయ‌నున్నాడో మ‌రి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.