close
Choose your channels

త్రీడీ టెక్నాల‌జీలో రోబో సీక్వెల్ '2.0'

Saturday, September 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రాన్ని ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా '2.0' నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వరిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా శ‌నివారం ఈ సినిమా ప్రెస్‌మీట్ హైద‌రాబాద్‌లోజ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజు మ‌హాలింగం, డి.సురేష్‌బాబు, శ‌ర‌త్‌మ‌రార్‌, భ‌ర‌త్‌, స‌త్యం, ప్రీత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజు మ‌హాలింగం మాట్లాడుతూ - "ఇండియా బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీగా రోబో సీక్వెల్‌గా 2.0 తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇండియాలో కాకుండా సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు చేస్తున్నాం. సినిమాను 2డీలోనే కాకుండా 3డీలో కూడా రూపొందిస్తున్నాం. ఏదో త్రీడీ రిగ్ అమ‌ర్చాల‌ని కాకుండా సినిమాను త్రీడీలో చేయ‌డం కాస్తా రిస్క్‌తో కూడిన వ్య‌వ‌హార‌మే అయినా, ప్రేక్ష‌కులకు ఓ కొత్త అనుభూతిని అందించాల‌నే త‌ప‌న‌తో సినిమానంత‌ట‌టినీ 3డీలో చేస్తున్నాం. సినిమాను చైనాలో ప‌దిహేను నుండి ప‌ద‌హారు వేల థియేట‌ర్స్‌లో విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం"అన్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.