close
Choose your channels

కూర‌గాయ‌లు అమ్మిన సామ్‌...

Saturday, September 1, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స‌మంత సినిమాలో సన్నివేశంలో కాకుండా.. నిజంగానే కూర‌గాయ‌లు అమ్మింది. అదేంటి స‌మంత కూర‌గాయ‌లు అమ్మిందా? అక్కినేని వారింటి కోడ‌లు కూర‌గాయ‌లు అమ్మ‌డ‌మేంటి? అని అనుకుంటున్నారా? వివ‌రాల్లోకెళ్తే స‌మంత ప్ర‌త్యూష చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ స్థాపించి సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ కోసం స‌మంత చెన్నై ట్రిపిల్ కేన్‌లోని జామ్‌బజార్‌కు వెళ్లి అక్క‌డ ఓ కూర‌గాయ‌ల దుకాణంలో కూర‌గాయ‌లు అమ్మారు. ముందు జ‌నం ఆశ్చ‌ర్య‌పోయినా.. త‌ర్వాత అస‌లు సంగ‌తి తెలుసుకుని కూర‌గాయ‌లను కొన్నారు.

స్టార్ హీరోయిన్‌.. అందులోనూ ఓ పెద్దింటి కోడ‌లు అయినా కూడా స‌మంత బేషజాల‌కు పోకుండా.. కూర‌గాయ‌లు అమ్మ‌డం త‌ద్వారా సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌నుకోవ‌డం గొప్పే క‌దా!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.