close
Choose your channels

నిహారిక పబ్‌లో వున్న మాట నిజమే .. కానీ : పుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంపై నాగబాబు స్పందన

Sunday, April 3, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ఆవరణలోని పుడింగ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ ఘటనలో పలువురు సెలబ్రెటీలు, సినీ ప్రముఖుల పిల్లలు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిగ్‌బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక అరెస్ట్ అయ్యారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

‘‘ గతరాత్రి బంజారాహిల్స్ రాడిసన్‌ బ్లూ పబ్‌లో జరిగిన సంఘటనపై నేను స్పందించటానికి కారణం.. నా కుమార్తె నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ సమయం ముగిసినా నడపటం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకూ అంతా క్లియర్‌. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్‌, మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని నేను మీ ముందుకు వచ్చా. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’అని నాగబాబు ఆ వీడియోలో వెల్లడించారు.

అంతకుముందు ఈ వ్యవహారానికి సంబంధించి సినీ నటి హేమ ఏకంగా బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చారు. తాను పబ్‌లో లేకపోయినా.. నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును పలు ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారని హేమ ఫైరయ్యారు. తన గురించి అవాస్తవాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదన్న ఆమె.. కొందరు కావాలనే తన పేరును ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos