close
Choose your channels

పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్న నటీమణులు.. ఎందుకిలా!?

Monday, February 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్న నటీమణులు.. ఎందుకిలా!?

సోషల్ మీడియా వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది.. రోజురోజుకూ దీని గురించి తెలియని వారు కూడా తెలుసుకుని సోషల్ రంగంలోకి దిగుతున్నారు. అయితే దీన్ని పనికొచ్చే అనగా మంచి పనుల కోసం వాడే వారి కంటే.. అనవసర విషయాలకు వాడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు ఇప్పుడెవరైనా సెలబ్రిటీ ఏదైనా ఒక ఫొటో కానీ.. తనకు సంబంధించిన ఏదైనా విషయాన్ని షేర్ చేసుకుంటే దానిపై నానా రకాలుగా కామెంట్స్.. చిత్రవిచిత్రాలు ఎమోజీలు,జిఫ్ ఇమేజీలు పోస్ట్ చేస్తుంటారు.

అంతేకాదు.. ఆ ఫొటోలను మార్ఫ్ చేస్తూ నానా హడావుడి చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా బండబూతులతో తిట్టిపోస్తున్నారు. అలా వ్యక్తిగతంగా వారి క్యారెక్టర్‌‌పై కామెంట్స్ చేస్తూ.. ఇలా రకరకాలుగా సెలబ్రిటీలపై చేస్తూ నేత్రానందం పొందుతున్నారు. అయితే వీరికి ఇలా చేయకూడదని బాగా తెలుసు.. అంతేకాదు.. అవతలి వ్యక్తులు గట్టిగా తలుచుకుంటే కేసులు, జైలుకు వెళ్లాల్సి వస్తుందని కూడా తెలుసు. బహుశా అలా జరిగితే అయినా తనకు ఫేమ్.. ఫేమస్ అవుతానని వాళ్లు అనుకుంటున్నారేమో తెలియట్లేదు కానీ పిచ్చి పిచ్చి పనులు మాత్రం అస్సలు తగ్గించుకోవట్లేదు.

అనసూయ పరిస్థితి ఇదీ!

ఇదిలా ఉంటే.. ఇప్పటికే తన ఫొటోను మార్ఫ్ చేశారంటూ గగ్గోలు పెట్టిన యాంకర్ అనసూయ.. తాజాగా ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా తనను ఇబ్బంది కలిగించే మాటలతో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు సదరు వ్యక్తి ట్విట్టర్ ఖాతా గురించి యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేసింది. అటు పోలీసులకు.. ఇటు ట్విట్టర్ యాజమాన్యానికి ఆ వ్యక్తి తనపై చేసిన పోస్ట్‌ల తాలుకు స్క్రీన్ షాట్లను కూడా యాడ్ చేసింది. ఫిర్యాదు స్వీకరంచిన సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. అనసూయ పోస్ట్ చేసిన ఆ స్క్రీన్ షాట్‌కు కింది భాగాన అనుష్క-అక్కినేని నాగార్జునలకు సంబంధించి ఫొటోలు కూడా ఉన్నాయి. దానికి బండబూతులతో కూడిన ట్వీట్ ఉంది.

మాధవీ పరిస్థితి ఇదీ..!
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ నటి, బీజేపీ మహిళా నేత మాధవీలత కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఇవాళ మధ్యాహ్నం సజ్జనార్ కార్యాలయానికి వెళ్లిన ఆమె తనపై వస్తున్న వేధింపులకు సంబంధించి రెండు ఫిర్యాదులు చేసింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వేదికగా ఆమె పంచుకుంది. వాటిలో ఒకటి తన వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించినది కాగా, మరొకటి సోషల్ మీడియాలో తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ దూషించడానికి సంబంధించినదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే.. తన మనసు గాయపడేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

జర గుర్తెట్టుకోండి..!

కాగా.. సెలబ్రిటీలు అయినా ఇంకెవరైనా సరే సోషల్ మీడియాను ఎక్కడి వరకూ వాడాలో అక్కడికే వాడితే మంచిది. శృతి మించితే మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంతకుమించి అతి అక్కర్లేదు కూడా..! అంతేకాదు ఆ సెలబ్రిటీలు ఫాలో అవుతున్న అభిమానులు లేదా నెటిజన్లు కూడా వారు పోస్ట్ చేసింది చూశామా..? ఆ ఫొటో కానీ.. ఆమె షేర్ చేసుకున్న ఏదైనా విషయం నచ్చిందా..? లైక్ కొట్టామా..? లేదంటే చూసి లైట్ తీసుకుని పక్కనెట్టేయడమే అంతవరకూ ఉండాలంతే కానీ.. ఇష్టానుసారం కామెంట్స్ చేసే హక్కు, వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే హక్కు ఎవరికీ లేదు అనే విషయం జర గుర్తెట్టుకోవాలి మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.