close
Choose your channels

మహేష్ 1 నేనొక్క డినే తర్వాత ఈ సినిమానే..!

Tuesday, December 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 23వ సినిమాను క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ తో చేస్తున్నారు. ఈ మూవీ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆత‌ర్వాత 24వ సినిమాని బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇక త‌న‌ కెరీర్ లో ముఖ్య‌మైన 25వ సినిమాని వంశీ పైడిప‌ల్లితో చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.
ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాన్ని మ‌హేష్....హీరోగా త‌న తొలి సినిమా నిర్మాత అశ్వ‌నీద‌త్, దిల్ రాజుల‌కు ఇచ్చారు. ఇక ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం యు.ఎస్ లోనే ఉంటుంద‌ట‌. 1 నేనొక్క‌డినే త‌ర్వాత ఎక్కువ భాగం యు.ఎస్ లో షూటింగ్ చేస్తున్న మ‌హేష్ మూవీ ఇదే. స్ర్కిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింది. ఈ భారీ చిత్రాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.