close
Choose your channels

'అజ్ఞాత‌వాసి` సెకండ్ సింగిల్ డేట్‌, ఆడియో డేట్‌

Thursday, December 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా 'అజ్ఞాతవాసి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుధ్‌ మ్యూజిక్ డైరెక్టర్.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 'బయటకొచ్చి చూస్తే' పాటను త్రివిక్రమ్ పుట్టినరోజున విడుదల చేసారు. ఆ పాట విని పవన్ ఫాన్స్ అనిరుధ్‌ మ్యూజిక్ కి ఫిదా అయిపోయారు. అంతే కాదు ఈ పాట పాడింది కూడా అనిరుధ్‌ కావడం విశేషం. శ్రీమణి రాసిన ఆ పాటకి మంచి స్పందన కూడా వచ్చింది. ఇప్పుడు రెండో పాట 'గాలి వాలుగా'ను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నారు. మరి ఈ పాట ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియో లాంచింగ్ కార్యక్రమం.. డిసెంబర్ 14 లేదా 15న జరగాల్సి ఉంది. తాజాగా ఈ కార్యక్రమం వాయిదా పడింద‌ని తెలిసింది. హైదరాబాదులో జరుగుతున్న తెలుగు మహాసభలు కారణంగా డిసెంబర్ 19 వరకు ఆడియో వేడుక‌కు అనుమతించలేమని పోలీసు శాఖ తెలియజేసింద‌ట‌. అందువలన ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 21న నిర్వహించడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది.

ప్రస్తుతానికి వేదికని ఇంకా ఫైనల్ చేయలేదు. అన్ని విషయాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని నిర్మాత తెలియజేసారు. అలాగే ఈ ఆడియో లాంచింగ్ కి ముందే ఈ మూవీకి సంబంధించి టీజరుని గాని వీడియో క్లిప్పింగుని గాని విడుదల చేయడానికి చిత్ర వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.