close
Choose your channels

పెళ్లిచూపులు చిత్రానికి అక్కినేని అవార్డ్..!

Tuesday, September 27, 2016 • తెలుగు Comments

విజ‌య్ దేవ‌ర‌కొండ - రీతువ‌ర్మ జంట‌గా త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పెళ్లిచూపులు. రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లిచూపులు చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఓవ‌ర్ సీస్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది అంటే ఏరేంజ్ స‌క్సెస్ సాధించిందో అర్ధం చేసుకోవ‌చ్చు.
ఇంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన పెళ్లిచూపులు చిత్రానికి పాపుల‌ర్ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ వంశీ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ బెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అంటూ అక్కినేని అవార్డ్ ప్ర‌దానం చేసింది. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరికి శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఈ అవార్డ్ ను అంద‌చేసారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz