close
Choose your channels

ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో చిత్రానికి సన్నాహాలు?

Sunday, April 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో చిత్రానికి సన్నాహాలు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ తరువాత ఫఉల్ జోష్ మీద ఉన్నారు. సంవత్సరాల తరబడి ఒక్కటే సినిమాకు కమిట్ కాకుండా సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తూ ఏకకాలంలో రెండు మూడు సినిమాల షూటింగ్‌లను కానిచ్చేస్తున్నాడు. ఇటీవలే లంబోర్గిని కారు కొని అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇక.. ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాలను ఏకకాలంలో నటిస్తున్నాడు. మరో విశేషమేమిటంటే.. ‘సాహో’ మొదలు ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్‌పైనే దృష్టి సారిస్తున్నాడు.

తాజాగా ప్రభాస్ మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారట. ఆ చిత్రం మరేదో కాదు.. ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయని సమాచారం. ఈ విషయాన్ని తమిళ వర్గాలు చెబుతుండటంతో దీనిపై క్లారిటీ వచ్చింది. తమిళ సినీ వర్గాలు. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌.. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘విక్రమ్’ పూర్తయిన వెంటనే ప్రభాస్‌తో సినిమాను పట్టాలెక్కించేస్తారని.. దీనికోసం ఇప్పటికే కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్.. ‘ఆదిపురుష్’, ‘సలార్’ తర్వాత నాగ్‌ అశ్విన్‌తో సినిమా చేస్తారు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్టు సమాచారం. ప్రభాస్‌ ‘బాహుబలి’, ‘సాహో’లతో నేషనల్ స్టార్‌గా మారిపోవడంతో ఆయనతో సినిమాలు రూపొందించేందుకు అన్ని ఇండస్ట్రీల దర్శకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.