close
Choose your channels

హత్య కేసులో కీలక ఆధారం కానున్న ‘అమెజాన్ అలెక్సా’

Tuesday, November 5, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హత్య కేసులో కీలక ఆధారం కానున్న ‘అమెజాన్ అలెక్సా’

ఓ హత్య కేసులో సౌండ్ రికార్డర్ అమెజాన్ అలెక్సా కీలక ఆధారంగా మారనుంది. అమెరికాలో ఫ్లోరిడాలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో భార్య తీవ్ర గాయాలతో చనిపోయింది. ఈ కేసులో అనుమానితుడిగా భర్త ఉన్నా... హత్య చేసింది తాను కాదని తీవ్రంగా వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. దీంతో పోలీసులు అక్కడున్న ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై దృష్టి పెట్టారు. అసలక్కడ ఏం జరిగింది.. వారి మధ్య సంభాషణ ఏంటి అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీనికోసం ఆ గదిలో ఉన్న అమెజాన్ అలెక్సాపై దృష్టి సారించారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు.. నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.