close
Choose your channels

హాట్ అనసూయ ఎయిర్ హోస్టెస్ గా.. మరో డిఫెరెంట్ అటెంప్ట్

Saturday, July 31, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందాల యాంకర్ అనసూయ టాలీవుడ్ లో నటిగా దూసుకుపోతోంది. అనసూయ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్ని ఎంపిక చేసుకుంటూ రాణిస్తోంది. రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర తన కెరీర్ లోనే మెమొరబుల్ రోల్ గా నిలిచిపోయింది. ఇక అనసూయ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలని కూడా ఎంపిక చేసుకుంటోంది.

తాజాగా అనసూయ ఓ వైవిధ్యమైన చిత్రానికి ఓకే చెప్పినట్లు టాక్. పేపర్ బాయ్ ఫేమ్ దర్శకుడు జయశంకర్ అంథాలజీ నేపథ్యంలో 6 ప్రధాన పాత్రలతో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. 6 ప్రధాన పాత్రల్లో ఒక రోల్ లో అనసూయ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అనసూయ ఈ చిత్రంలో ఎయిర్ హోస్టెస్ గా నటించనుంది.

జయశంకర్ ఈ కథని చాలా అద్భుతంగా రాసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదు పాత్రలు ఏంటో తెలియాల్సి ఉంది. ఆగష్టు నుంచి ఈ చిత్ర షూటింగ్ లో అనసూయ పాల్గొననుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయిందట.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అనసూయ పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలంలో అనసూయ నటనకు మెచ్చిన సుకుమార్ ఈ మూవీలో కూడా అవకాశం ఇచ్చారు. పుష్పతో పాటు అనసూయ కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ, రవితేజ ఖిలాడీ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల అనసూయ థాంక్యూ బ్రదర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాంకర్ గా రాణిస్తూనే నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది ఈ హాట్ బ్యూటీ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.