close
Choose your channels

సరిలేరు రిలీజ్‌కు ముందే అనిల్‌కు పండుగొచ్చింది!!

Sunday, January 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సరిలేరు రిలీజ్‌కు ముందే అనిల్‌కు పండుగొచ్చింది!!

సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. అంటే సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు డబుల్ పండుగేనన్న మాట. ఇదిలా ఉంటే.. సంక్రాంతి, ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్‌కు ముందే డైరెక్టర్ అనిల్ రావిపూడికి పండుగొచ్చింది. అదేమిటంటే.. అనిల్ సతీమణి ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం ఈ శుభవార్తను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీరాభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అనిల్, మహేశ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ.. కంగ్రాట్స్ చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే.. అనిల్ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారన్న మాట. కాగా.. మహేశ్, రష్మిక నటీనటులుగా అనిల్ తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా జనవరి 11న రిలీజ్ కానుంది. నిన్న మొన్నటి వరకూ సినిమా రిలీజ్‌పై కన్ఫూజన్‌, సస్పెన్షన్ నెలకొన్నది. అయితే.. శనివారం సాయంత్రం ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి యథావిథిగా సినిమా అనుకున్న రోజునే రిలీజ్ కానుందని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.