సయేషాతో పెళ్లి కన్ఫర్మ్ చేసిన ఆర్య
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ నటుడు ఆర్య, హీరోయిన్ సయేషా ప్రేమించుకున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే గురువారం ప్రేమికుల రోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా హీరో ఆర్య ఈ విషయాన్ని ధృవీకరించారు.
'మా తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆశీస్సులతో మేమిద్దరం మార్చిలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాం. మా కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశీర్వదించండి' అని పేర్కొంటూ అభిమానులకు వాలంటైన్స్ డే విషెస్ తెలిపారు.
ఆర్య, సయేషా 'గజినీకాంత్' చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. సయేషా ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.