close
Choose your channels

Bigg Boss Telugu 7 : వెళ్లిపోతానన్న శివాజీని ఆపిన నాగార్జున , అశ్విని ఎలిమినేట్ .. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడనన్న ప్రశాంత్

Sunday, November 26, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు ఉత్కంఠగా జరుగుతోంది. మరికొద్దిరోజుల్లో ఈ సీజన్ ముగియనుండటంతో చివరి రోజుల్లో నిర్వాహకులు కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నారు. శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ చేసిన తప్పులు, ఈ వారం వారి పర్ఫార్మెన్స్‌పై రివ్యూ ఇచ్చారు . ఒక్కొక్కరిని నిలబెట్టి తనదైన శైలిలో కడిగిపారేశారు.

తొలుత కెప్టెన్సీ టాస్క్‌లో తనకు అన్యాయం జరగడం, ఏకంగా ఈ వారం కెప్టెన్సీనే బిగ్‌బాస్ రద్దు చేయడంతో అమర్‌దీప్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఎవరొచ్చి ఓదార్చినా అతను మామూలు మనిషి కాలేదు. అనంతరం శివాజీని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన బిగ్‌బాస్.. నీ భుజం నొప్పి ఎలా వుంది..? అంతా ఓకేనా అని ప్రశ్నించాడు. నొప్పి పూర్తిగా తగ్గలేదని కానీ పర్లేదని ఆన్సర్ ఇచ్చాడు శివాజీ. ఇకపై నీ ఆరోగ్యం బాధ్యత నీదేనని.. హౌస్‌లో వుండాలి అనుకుంటే వుండొచ్చు లేదా వెళ్లిపోవచ్చునని బిగ్‌బాస్ తేల్చిచెప్పాడు. తొలుత కొనసాగుతానని చెప్పిన శివాజీ.. ఆపై ఆలోచించి వెళ్లిపోతానని ఆన్సర్ ఇచ్చాడు.

అయితే శివాజీని కన్ఫెషన్‌ రూంకి పిలిచిన నాగార్జున కూడా హెల్త్ ఎలా వుందని ఆరా తీశారు. 100 శాతం ఎఫర్ట్ పెట్టలేనప్పుడు టైటిల్ ఆశించడం కరెక్ట్ కాదని.. అందుకే వెళ్లిపోతానని శివాజీ చెప్పాడు. అంతగా ఆలోచించాల్సిన పనిలేదని, భయపడొద్దని నాగ్ సూచించడంతో వెళ్లిపోవాలి అన్న ఆలోచనను శివాజీ విరమించుకున్నాడు. అయితే ఆయన గ్రాండ్ ఫినాలే వరకు వుంటారా.. లేక మధ్యలోనే వెళ్లిపోతారా అన్నది మాత్రం గాయం తీవ్రతపై ఆధారపడి వుంటుంది.

తర్వాత కెప్టెన్సీ టాస్క్ విషయంలో అమర్‌దీప్‌కు ఎందుకు సపోర్ట్ చేయలేదని శివాజీని ప్రశ్నించాడు నాగ్. అమర్‌కి మాటిస్తున్నా అన్నావ్.. మాట కోసం చచ్చిపోతాను అన్నావ్ ఇప్పుడు మాట మార్చావ్ అని ఫైర్ అయ్యాడు. కెప్టెన్ అయితే డిప్యూటీలుగా ప్రియాంక, శోభాలను పెట్టుకుంటానని అమర్ చెప్పడం వల్లే తాను సపోర్ట్ చేయలేదని శివాజీ వివరణ ఇచ్చాడు. గతంలో ప్రియాంక కెప్టెన్‌గా వున్నప్పుడు సరిగా జరగలేదని చెప్పడంతో ప్రియాంక గొడవకు దిగింది. ఆమెకు నాగార్జున ఎలాగోలా సర్దిచెప్పి కూర్చొబెట్టాడు. తర్వాత యావర్‌.. ప్రియాంకతో వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆమెకు సరిచెప్పించాడు.

అనంతరం అశ్విని లేపి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా నువ్వు సెల్ఫ్ నామినేట్ అయ్యావంటే దీన్ని కాన్ఫిడెన్స్ అనాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా అని నాగార్జున ఫైర్ అయ్యారు. మన నిర్ణయాలు, తప్పులే మనకు దెబ్బేస్తాయని చెప్పాడు. గన్‌తో పేల్చడం అనే టాస్క్‌తో అశ్విని ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించాడు. ప్రశాంత్‌ను.. నువ్వేమైనా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగిస్తావా అని నాగ్ అడిగారు. అయితే తాను 14వ వారం వేరొకరి కోసం వాడతానని ప్రశాంత్ చెప్పాడు. మరోవైపు డబుల్ ఎలిమినేషన్ నేపథ్యంలో రతిక కూడా బయటకు వచ్చేసినట్లుగా తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.